అక్షరటుడే, డిచ్పల్లి: Ramadugu Chain Snatching | కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న చైన్‌స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ధర్పల్లి(Dharpally) మండలం రామడుగు గ్రామంలో మహిళ గొలసును ఎత్తుకెళ్లారు.
Ramadugu Chain Snatching | ధర్పల్లి మండలం రామడుగు..
ధర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన గడ్డం పద్మ తన ఇంటి నుండి నిజామాబాద్ వెళ్లేందుకు బస్‌స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై ఎదురుగా వచ్చి ఆమె మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. నిందితుడిని త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు పోలీసు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టామని, నిందితుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే