Nizamabad Medical Jobs | ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Medical Jobs | జిల్లా (Nizamabad) కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కళాశాల ప్రినిపాల్​ డాక్టర్​ ఎన్​.కృష్ణమోహన్​ మంగళవారం నోటిఫికేషన్​ విడుదల చేశారు.

Nizamabad Medical Jobs | కళాశాలలో..

ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు ప్రొఫెసర్​ పోస్టులు, ఏడు అసోసియేట్​ ప్రొఫెసర్​ పోస్టులు, 51 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్​ తెలిపారు. అలాగే 15 ట్యూటర్​ ఉద్యోగాలు, ఆరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి డీఎంఈ నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు. ఆయా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి అనుమతి లభించిందన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల పనిదినాల్లో సాయంత్రం 4 గంటల్లోపు నిర్దేశించిన తేదీల్లో అందజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ కోసం ఈనెల 22వ తేదీన ఉదయం 10.30కు తమ ఒరిజినల్​ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఖాళీలు, వేతన వివరాల కోసం కళాశాల వెబ్​సైట్​ను సందర్శించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Banswada Tribal Issues | కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు అన్యాయం..: బాజిరెడ్డి గోవర్ధన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *