అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Illegal Clinics Nizamabad | అనుమతిలేని క్లినిక్లపై జిల్లా వైద్యశాఖ(Health Department) కొరడా ఝులిపించింది. జిల్లా కేంద్రంలో(Nizamabad) అనుమతి లేకుండా నలుగురు పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్లను సీజ్ చేసింది.
Illegal Clinics Nizamabad | నాల్గో టౌన్ పరిధిలోని..
నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో డీఎంహెచ్వో రాజశ్రీ ఆదేశానుసారం వైద్యురాలు సుప్రియ ఆధ్వర్యంలో వైద్యశాఖాధికారులు పలు క్లినిక్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్టేట్ మెడికల్ కౌన్సిల్(State Medical Council) ఆధ్వర్యంలో గతంలో జిల్లాలో పీఎంపీ,ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్లను తనిఖీ చేశారన్నారు. అర్హతకు మించి వైద్యం చేయడం.. యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా ఇవ్వడాన్ని పరిశీలించిన కౌన్సిల్ సభ్యులు సంబంధిత క్లినిక్లు నిర్వహిస్తున్న వారికి నోటీసులు సైతం ఇచ్చారు.
అనంతరం వారిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ నుంచి జిల్లా వైద్య శాఖకు వచ్చిన ఆదేశానుసారం గురువారం 4 క్లినిక్లను అధికారులు సీజ్ చేశారు. నాలుగో టౌన్ ఎస్ఐ కరీం ఆధ్వర్యంలో సిబ్బంది ఆయా క్లినిక్లకు చేరుకొని సీజ్ చేస్తున్నట్లుగా నోటీసులు అంటించారు, ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు, రామకృష్ణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: భక్తుల జయజయ ధ్వానాల మధ్య కొనసాగుతున్న పూరీ జగన్నాథ రథయాత్ర