అక్షరటుడే, మెండోరా: 2K Run Awareness | ‘మన ఊరు – మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా మెండోరా (Mendora), ఆర్మూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
2K Run Awareness | పోచంపాడ్ గ్రామం నుంచి ఎక్స్ రోడ్ వరకు..
పోచంపాడ్ గ్రామం నుంచి పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వరకు శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెండోరా ఎస్సై సుహాసిని మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారు తమ భవిష్యత్తుతో పాటు కుటుంబం, సమాజానికీ నష్టం కలిగిస్తారని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎస్సై శైలేందర్, ముప్కాల్ ఎస్సై కిరణ్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
2K Run Awareness | ఆర్మూర్‌లో..

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పోలీస్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో 2కే రన్ నిర్వహించగా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ గోనె లహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. డ్రగ్స్ విషయమై యువత, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. లేదా డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Srinath Reddy Death | బర్త్ డే పార్టీకి వెళ్లిన యువకుడి మృతి.. లండన్‌లో ఘటన