Municipal Workers Safety | మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి

మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Municipal Workers Safety | మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి (Municipal Chairperson Umarani)పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు రెయిన్​కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌లను పంపిణీ చేశారు.

Municipal Workers Safety | ప్రజారోగ్య పరిరక్షణలో వారిదే కీలకపాత్ర

ఛైర్​పర్సన్​ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు నిరంతరం పారిశుధ్య సేవలు అందించే కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వర్షంలో విధులు నిర్వర్తించేటప్పుడు అవసరమైన రక్షణ సామగ్రి అందించడం మున్సిపాలిటీ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను అందరూ గౌరవించాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్​పర్సన్​ కాసార్ల గోదావరి, కౌన్సిలర్స్ అఖిల, హఫీజ్, కమిషనర్ పర్వతాలు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Atya Patya Selection | జిల్లా స్థాయి అత్యా–పత్యా సబ్ జూనియర్ పోటీలు.. రాష్ట్ర స్థాయి కాంపిటీషన్​కు ప్రతిభావంతుల ఎంపిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *