Bahrain Labour Union | బహ్రెయిన్‌ ‘ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్’ అధ్యక్షుడి రాజీనామా

బహ్రెయిన్‌ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్ష పదవికి భీమ్​గల్ మండలం బాబానగర్ గ్రామానికి చెందిన తోట రమేశ్ రాజీనామా చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Bahrain Labour Union | బహ్రెయిన్‌(Bahrain) ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్ష పదవికి భీమ్​గల్(Bheemgal) మండలం బాబానగర్ గ్రామానికి చెందిన తోట రమేశ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు.

Bahrain Labour Union | అనివార్య కారణాలతో..

అనివార్య కారణాల వల్ల తాను ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో, ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తోట రమేశ్​ ప్రకటించారు. గత ఐదేళ్లుగా యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ కార్మికుల సంక్షేమానికి, హక్కుల రక్షణకు కృషి చేసే అవకాశం కల్పించినందుకు రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉన్న క్రియాశీల సభ్యులలో ఒకరిని నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాలని లేఖలో సూచించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా యూనియన్ యాజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *