అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ (Hyderabad)లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు వారాలుగా లైంగికంగా వేధించాడని, శారీరకంగా దాడి చేశాడని, బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్రైవేట్ వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి తన భర్తకు పంపించాడని ఆ మహిళా అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం గమనార్హం.
Uday Krishna Reddy | విషమంగా పరిస్థితి
ఎర్రగడ్డ, మోతీనగర్ ప్రాంతంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. కాగా ఆయనపై కేసు నమోదు అయిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Uday Krishna Reddy | స్ఫూర్తిగా నిలిచి..
ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన 2013లో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యాడు. అయితే ఓ సీఐ అవమానించడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం కష్టపడి చదివి ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాడు. ఆ సమయంలో ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి తాజా వివాదంతో ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు వెళ్లారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం అంటూ ఉదయ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి..: H-FAST Raids | హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో హెచ్-ఫాస్ట్ దాడులు