Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ షోలా కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం: బండి సంజయ్

తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay Comments | తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా ఆయన ఈ రెండు పార్టీల తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ అంటూ..

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల విమర్శలు, ప్రతివిమర్శలను చూస్తుంటే ఏదో రియాలిటీ షో ‘బిగ్ బాస్’ను తలపిస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. “వీరు వారం ముందే రిహార్సల్ చేసుకుని మరీ పోటాపోటీగా నటిస్తున్నారు. అబద్ధాలు చెప్పడంలో నటనకు ఆస్కార్ అవార్డు ఇస్తే, ఆ ఇద్దరూ దానికి వంద శాతం అర్హులవుతారు” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. నేతల తీరును చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

bandisanjay.1

Bandi Sanjay Comments | చర్చకు బహిరంగ సవాల్..

కేవలం డ్రామాలకే పరిమితం కాకుండా, పాలనా వైఫల్యాలు , అక్రమాలపై చర్చకు రావాలని బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బహిరంగ సవాల్ విసిరారు. గురుకులాల టెండర్లు, రాష్ట్రానికి పట్టిన అప్పులు, అవినీతి వంటి అంశాలపై చర్చకు సిద్ధమా? వేదిక, సమయం తామే నిర్ణయిస్తామని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. అదే సమయంలో, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, సంక్షేమ పథకాలపై కూడా చర్చించుకుందామని ఆయన స్పష్టం చేశారు.

Bandi Sanjay Comments | ప్రజలు ‘డబుల్ ఎలిమినేషన్’ చేస్తారు..

నేతలు ఇలాగే ప్రజలను మభ్యపెట్టే డ్రామాలను కొనసాగిస్తే, ప్రజలు వారిని అసహ్యించుకోవడం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు. ఈ ‘రాజకీయ బిగ్ బాస్’ షోలో ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ‘డబుల్ ఎలిమినేషన్’ ఖరారు చేశారని, తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:  KTR Sensational Comments | రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *