అక్షరటుడే, వెబ్డెస్క్ : Power Supply | అంతరాయం లేకుండా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్ నుంచి ఆయన విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu)తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించాను. వ్యవసాయం, గృహావసరాలు, పరిశ్రమలకు అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Power Supply | బొగ్గు కొనుగోలుకు సహకారం
విద్యుత్ ఉత్పత్తికి తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే కోల్ ఇండియా నుంచి అదనపు బొగ్గు కొనుగోలుకు ప్రభుత్వం నిధుల కొరత లేకుండా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలన్నారు.
ఇది కూడా చదవండి..: hyderabad vijayawada highway | హైదరాబాద్ – విజయవాడ హైవేకు మహర్దశ!