hyderabad vijayawada highway | హైదరాబాద్ – విజయవాడ హైవేకు మహర్దశ!

వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: hyderabad vijayawada highway | తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక గుడ్ న్యూస్! ఎప్పుడూ రద్దీతో, ట్రాఫిక్ జామ్‌లతో, మరణ మృదంగం మోగించే ప్రమాదాలతో భయపెట్టే ఆ మహా రహదారికి ఎట్టకేలకు మహర్దశ రాబోతోంది.

తెలుగు రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ హైవే ప్రయాణాన్ని ఇకపై మరింత ఈజీ, సేఫ్‌గా మార్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది! ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం!

hyderabad vijayawada highway | NHAI కీలక నిర్ణయం

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటేనే చాలామంది ఒకింత ఆందోళన చెందుతుంటారు. రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న వాహనాల రద్దీకి తోడు, ఈ మార్గంలో తరచూ జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

‘ఫోర్ లేన్’ హైవే కాస్తా రద్దీని తట్టుకోలేక అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలోనే వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది.

hyderabad vijayawada highway | ఆరు లైన్లుగా విస్తరణ

ఇప్పటివరకు నాలుగు లైన్లుగా ఉన్న హైదరాబాద్‌–విజయవాడ నేషనల్ హైవేను (NH-65) ఇకపై సరికొత్తగా ఆరు లైన్లుగా (6-Lane) విస్తరించనున్నారు. ఇటీవల తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో NHAI ఛైర్మన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అడుగులు వేగంగా పడ్డాయి. టెండర్ ప్రక్రియ కూడా పూర్తికాగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు ప్రారంభం కానున్నట్లు స్పష్టమైంది.

vadodara gold theft | దసరా వేళ ప్రారంభానికి ముస్తాబు..కొత్త షోరూమ్‌లో 12 నిమిషాల్లోనే 5.5 కేజీల బంగారం మాయం!

ఎన్ని రోజులుగానో ఎదురుచూస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ పనులు త్వరలోనే ప్రారంభం కానుండటం ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశం. ఇకపై విజయవాడ జర్నీ మరింత సాఫీగా, హ్యాపీగా సాగిపోతుందన్నమాట!

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *