BRS Formation Day | కేసీఆర్​ను​ మళ్లీ సీఎంను చేసే వరకు పోరాడుతాం : కేటీఆర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS Formation Day | తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) పార్టీ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణ కోసం అన్ని పదవులు వదులుకొని, 25 సంవత్సరాల క్రితం ఇదే రోజు జలదృశ్యంలో కేసీఆర్​ (KCR) పార్టీని ఏర్పాటు చేశారన్నారు. మొదటి 14 సంవత్సరాలు తెలంగాణ (Telangana) ప్రజలను, జాతిని ఐక్యం చేసి ఢిల్లీ మెడలు వంచామని చెప్పారు. తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే పాలించి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర భాగాన పెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రెండున్నరేళ్లుగా ఈ దుర్మార్గపు పాలనలో అణచివేతలకు గురవుతున్న ప్రజలకు గొంతుకై నిలుస్తున్నది ఈ గులాబీ పార్టీ అన్నారు.

BRS Formation Day | పునరంకితం అవుతాం

కేసీఆర్​ తన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం పార్టీని స్థాపించారన్నారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఆయన కొండా లక్ష్మణ్​ బాపూజీ మార్గదర్శకంలో పార్టీ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణను కాపాడాటానికి మళ్లీ పునరంకితం అవుతామన్నారు. కాంగ్రెస్​ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయానికి పోరాటం చేస్తామన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్​ సీఎం అయ్యే వరకు కలిసి కట్టుగా కదం తొక్కుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao | ప్రగతి రథం ఆగిపోయింది.. మళ్ళీ పరిగెత్తించేది బీఆర్‌ఎస్సే: హరీశ్‌రావు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *