AAP MPs Join BJP | బీజేపీ గూటికి ఏడుగురు ఎంపీలు.. విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

Srinivas Kolluri

అక్షరటుడే, న్యూఢిల్లీ : AAP MPs Join BJP | ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి ఊహించని రాజకీయ దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు సామూహికంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)లో చేరగా, వారిని బీజేపీ ఎంపీలుగా గుర్తిస్తూ రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో సభలో బీజేపీ బలం అనూహ్యంగా పెరగగా, ఆప్ ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది.

AAP MPs Join BJP | పెరిగిన బీజేపీ బలం:

ఏడుగురు ఎంపీల చేరికతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 106 నుండి 113కు చేరుకుంది. అదే సమయంలో ఆప్ సభ్యుల సంఖ్య కేవలం 3కు పడిపోయింది. బీజేపీ గూటికి చేరిన వారిలో రాఘవ్ చద్దా, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, అశోక్ మిట్టల్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ ఉన్నారు. వీరంతా ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

AAP MPs Join BJP | రాఘవ్ చద్దాపై నిప్పులు

ఎంపీల ఫిరాయింపుపై ఆప్ నేత సంజయ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ చేరికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాఘవ్ చద్దా (Raghav Chadha)పై నిప్పులు చెరిగారు. పంజాబ్ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీని మోసం చేశారని విమర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

AAP MPs Join BJP | కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

ఒకవైపు ఎంపీల చేరికతో పార్టీ సతమతమవుతుంటే, మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జస్టిస్ స్వర్ణకాంతకు లేఖ రాశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల జడ్జిల ముందు తాను హాజరుకాబోనని అందులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Kejriwal Court Letter | న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు.. హైకోర్టు జడ్జికి కేజ్రీవాల్ లేఖ

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *