అక్షరటుడే, వెబ్‌డెస్క్: nandan Nilekani AI exams | దేశంలో నిత్యం కలవరపెడుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీని సరికొత్త మార్గంలో ఉపయోగించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు.
పరీక్షల నిర్వహణ పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ పరీక్షల వ్యవస్థలోని లోపాలు, వాటికి చెక్ పెట్టే మార్గాలను విశ్లేషించారు..
nandan Nilekani AI exams | లీకేజీలకు అసలు కారణం
ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక ప్రధానంగా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశే కారణమని నీలేకని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడాలని ఆయన సూచించారు.
పెద్ద ఎత్తున ప్రశ్నలతో కూడిన ఒక డేటాబేస్‌ను సిద్ధం చేసి, పరీక్ష జరిగే రోజే ఏఐ సాయంతో ఆ ప్రశ్నలను ఎంపిక చేసి కొత్త ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. దీనివల్ల ముందుగానే పేపర్ లీక్ అయ్యే అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు.
nandan Nilekani AI exams | కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) విస్తరణ
దేశవ్యాప్తంగా సీబీటీ (CBT) విధానాన్ని మరింత విస్తరించాలని నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల ప్రాంతాల్లో విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలు రాసే సదుపాయం ఉండగా, ఈ నెట్‌వర్క్‌ను ఇంకా పెంచాల్సి ఉంది. అయితే ఇది గ్రామీణ స్థాయి వరకు సజావుగా సాగాలంటే ఇంటర్నెట్, విద్యుత్, కంప్యూటర్ల వంటి మౌలిక వసతులు బలోపేతం కావాలి.
Senior Lawyer Court Clash | కోర్టులో ఊహించని పరిణామం..జడ్జికి షాకిచ్చిన సీనియర్ అడ్వకేట్!
nandan Nilekani AI exams | ప్రభుత్వ సానుకూలత
పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నట్లు నీలేకని వెల్లడించారు. ఈ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే మార్గాలపై తాము ప్రతిపాదనలు ఇస్తున్నామన్నారు.
వీటి అమలుపై ప్రధానమంత్రి కూడా విశేష ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అయితే, ఈ ఏఐ విధానాన్ని ఏయే పరీక్షల్లో, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.