Senior Lawyer Court Clash | కోర్టులో ఊహించని పరిణామం..జడ్జికి షాకిచ్చిన సీనియర్ అడ్వకేట్​!

'ఇలాంటి పరిణామాల వల్ల దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Senior Lawyer Court Clash | న్యాయస్థానంలో న్యాయమూర్తి తీర్పులు ఇస్తారు.. అడ్వకేట్లు వాదనలు వినిపిస్తారు. కానీ, ఒక సీనియర్ అడ్వకేట్​ ఏకంగా జడ్జి గారి ముందే గొంతు ఎత్తి.. వ్యవస్థపైనే నిప్పులు చెరిగితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Senior Lawyer Court Clash | బహిరంగంగానే తీవ్ర ఆక్షేపణ

సాధారణంగా కోర్టుల్లో జడ్జీల ముందు అడ్వకేట్లు ఎంతో అంకితభావంతో, మర్యాదపూర్వకంగా వాదనలు వినిపిస్తారు. కానీ, సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం సీన్ పూర్తిగా వేరేలా ఉంది. విచారణ సందర్భంగా కోర్టు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక సీనియర్ న్యాయవాది ఏకంగా జడ్జి గారికి గట్టి షాకిచ్చారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

కోర్టు ప్రొసీడింగ్స్‌పై ఆయన బహిరంగంగానే తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ‘ఇలాంటి పరిణామాల వల్ల దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Senior Lawyer Court Clash | నెట్టింట వైరల్​

న్యాయమూర్తి సమక్షంలోనే ఒక సీనియర్ న్యాయవాది అంత నిర్భయంగా, వ్యవస్థ తీరును ప్రశ్నిస్తూ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోర్టు హాల్‌లో లాయర్‌కు, జడ్జికి మధ్య జరిగిన ఈ తీవ్ర వాగ్వాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. న్యాయస్థానాలలో పారదర్శకత, వ్యవస్థపై నమ్మకం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

https://x.com/UttarandhraNow/status/2109906670877123043

 

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *