Delhi Green Crackers Ban | ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు ఆందోళన

ఢిల్లీలో గ్రీన్​ టపాసుల ముసుగులో సాధారణ క్రాకర్స్​ విక్రయించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Green Crackers | ఢిల్లీ (Delhi)లో టపాసుల విక్రయాలపై ఆంక్షలు అమలు కావడం లేదని మీడియాలో వచ్చిన కథనాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య రహిత, గ్రీన్​ టపాసులు మాత్రమే విక్రయించాలని కోర్టు ఆదేశించినా.. అన్ని రకాల క్రాకర్స్​ విక్రయాలు చేపడుతున్నట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో పర్యావరణ అనుకూల టపాసులు మాత్రమే విక్రయించాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే విక్రేతులు బయట ‘గ్రీన్’, ‘కాలుష్య రహిత’, ‘జీరో-పొల్యూషన్ టపాసులు’ అని లేబుల్ వేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. కానీ వినియోగదారులు అడిగితే సాధారణ టపాసులు కూడా అమ్ముతున్నారు. క్యూఆర్​ కోడ్​లు లేని ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

Delhi Green Crackers | ఆదేశాలు అమలు చేయాలి

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం దృష్ట్యా, టపాసుల తయారీ, అమ్మకం, కాల్చడంపై ఆంక్షలకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. సాధారణ టపాసుల అక్రమ అమ్మకం, వినియోగాన్ని నిరోధించడంలో గతంలో విధించిన పూర్తిస్థాయి నిషేధాలు విఫలమయ్యాయని కోర్టు పేర్కొంది. అటువంటి ఉత్పత్తులను తరచుగా ‘గ్రీన్ టపాసులు’ అనే ముసుగులో అమ్ముతున్నారని కోర్టు గమనించింది. తన మునుపటి ఆదేశాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. గ్రీన్​ టపాసులు మాత్రమే విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి..: Nepal Helicopter Crash | నేపాల్​లో ఢీకొన్న హెలీకాప్టర్లు.. ఒకరి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *