Nepal Helicopter Crash | నేపాల్​లో ఢీకొన్న హెలీకాప్టర్లు.. ఒకరి మృతి

నేపాల్​లో ల్యాండ్​ అవుతుండగా.. రెండు హెలీకాప్టర్లు ఢీకొన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Helicopter Crash | నేపాల్​లో ల్యాండ్​ అవుతుండగా.. రెండు హెలీకాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని భారత్​కు చెందిన వసంత్​కుమార్​గా పోలీసులు గుర్తించారు.

నేపాల్‌ (Nepal)లోని మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో ఎత్తైన విమానయాన కేంద్రంలో ల్యాండ్ అవుతుండగా హెలీకాప్టర్లు ఢీకొన్నాయి. ల్యాండ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు రెండు హెలికాప్టర్ల రోటర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం అవి కింద కూలిపోయాయి. దీంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Nepal Helicopter Crash | విస్తృతంగా వినియోగం

హిమాలయ దేశమైన నేపాల్​లో హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తారు. పర్యాటకులు, పర్వతారోహకులు, సామగ్రిని రవాణా చేయడానికి, అత్యవసర తరలింపులు చేపట్టడానికి చిన్న హెలికాప్టర్లను వాడతారు. కొండ ప్రాంతాలు ఉండటంతో ఎక్కువగా చిన్న హెలికాప్టర్ సేవలను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి..: Delhi Green Crackers | దీపావళి బాణసంచాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *