UPI MDR Charges | అమెరికా ఒత్తిడికి మోదీ తలొగ్గారు.. యూపీఐపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రూపంలో పరోక్షంగా చార్జీలు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: UPI MDR Charges | యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రూపంలో పరోక్షంగా చార్జీలు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  ( Rahul Gandhi )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రూ.2 వేలకు మించిన లావాదేవీలు యూపీఐ వాల్యూమ్‌లో కేవలం 5 శాతమే అయినప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో మాత్రం ఇవి దాదాపు 65 శాతం వరకు ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

UPI MDR Charges | సామాన్యుల జేబుకే చిల్లు..

కస్టమర్లపై నేరుగా ఎలాంటి రుసుములు విధించడం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులపై పడే ఈ అదనపు భారం చివరికి ఎక్కడి నుంచి వస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మర్చంట్లు చెల్లించే ఈ రుసుములను వస్తువులు, సేవల ధరలకు కలపడం వల్ల.. పరోక్షంగా ఆ భారం సాధారణ ప్రజల జేబుల పైనే పడుతుందని రాహుల్ ఎత్తిచూపారు.

UPI MDR Charges | అగ్రరాజ్య ఒత్తిడికి..

భారత్‌లో అమలవుతున్న జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమెరికా చెల్లింపుల కంపెనీలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ దేశాల ఒత్తిడికి తలొగ్గుతోందని ఆరోపించారు. గతంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందాల మాదిరిగానే.. ప్రస్తుత నిర్ణయంతోనూ ప్రధాని మోదీమరోసారి అగ్రరాజ్య ఒత్తిడికి తలవంచి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *