Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

సీపీఐ మావోయిస్టు సీనియర్ అండర్ గ్రౌండ్ క్యాడర్​ డివిజన్​ కమిటీ సభ్యురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీపీఐ మావోయిస్టు సీనియర్ అండర్ గ్రౌండ్ క్యాడర్​ డివిజన్​ కమిటీ సభ్యురాలు పోలీసుల (Nizamabad Police) ఎదుట లొంగిపోయింది.

Maoist Lalitha Surrender | జనజీవన స్రవంతిలో..

మావోయిస్టు కమిటీ సభ్యురాలు నక్క సుశీల అలియాస్​ రాణి అలియాస్​ లత లలిత రేలా జ్యోతి అలియాస్​ మాధవి అలియాస్​ శ్వేత నిజామాబాద్ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు.  ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) మంగళవారం మీడియా సమక్షంలో వివరాలు వెల్లడించారు. మావోయిస్ట్​ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​ కమిటీ సభ్యురాలు, డీవీసీ ఛత్తీస్​ఘడ్ ఏరియా సభ్యురాలైన నక్క సుశీల బోధన్​లోని శంకర్ నగర్​ కాగా.. ఆమె తండ్రి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్​గా పనిచేసేవారు. అక్టోబర్ 2005లో ఆయన గుండెపోటుతో మరణించారు. సుశీల చిన్నప్పుడే తల్లి కమల అనారోగ్యంతో మృతి చెందింది. సుశీల 1985లో హైదరాబాద్​లోని నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. 1985 నుంచి 1987 వరకు, ఇంటర్మీడియట్ అలాగే 1987 నుంచి 1990 వరకు డిగ్రీ విద్యను హైదరాబాద్​లోని నాంపల్లి ఉన్నత విద్య వనిత జూనియర్ కాలేజీలో డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం బీఈడీ కూడా చేశారు.

Maoist Lalitha Surrender | అనంతరం మావోయిస్టుగా..

హైదరాబాద్​లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెకు బంధువైన సురేంద్ర ద్వారా దివంగత రామ్మోహన్​రావు పరిచయమయ్యారు. ఆయన సీపీఐ ఎంఎల్ పీడబ్ల్యూ సిద్ధాంతాలు కలిగి ఉండడంతో సుశీల ఆకర్షితురాలైంది. ఆమె 1990లో నల్గొండ జిల్లా కమిటీ ఏసీఎం అయిన సుంకర రామ్మోహన్​రావును వివాహం చేసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 1992లో సీపీఐఎంఎల్ పీడబ్ల్యులో చేరారు. 2001లో నల్లమల అడవిలో జరిగిన ఎదురు కాల్పుల్లో రామ్మోహన్ రావు మరణించారు. ఆ తర్వాత 2004లో ఆమె ఎస్​సీఎం సామలును వివాహం చేసుకున్నారు. ఛత్తీస్ గడ్ అటవీప్రాంతంలో 2006లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారు. అయితే తెలంగాణకు చెందిన అజ్ఞాత మావోయిస్టు కార్యకర్తలు అందరూ జనజీవన స్రవంతిలో చేరాలని ప్రభుత్వం చేసిన సూచన మేరకు నక్క సుశీల సైతం జనజీవన స్రవంతిలో కలిసినట్లు సీపీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: చీమ లాంటి వినాయకుడి రథం.. మైక్రో ఆర్టిస్ట్ నైపుణ్యం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *