అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CP Radhakrishnan | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి పరేడ్‌లో కేంద్ర పారామిలటరీ దళాల కవాతు ఉంటుంది. తెలంగాణ కళాకారుల వివిధ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ విమోచన ఉద్యమ ఘట్టాలపై బుధవారం ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మంగళవారం పరిశీలించారు.
CP Radhakrishnan | ఏర్పాట్లపై సమీక్ష
ఉపరాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) తెలిపారు. ఆయన పర్యటనపై సచివాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 17 న ఉదయం 8.30 గంటలకు సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకొని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు