Future City Investments | ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​బాబు

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్​ ప్రతినిధులను మంత్రి శ్రీధర్​ బాబు కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Future City Investments | ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్‌ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణ (Telangana)తో అనుసంధానించాలన్నారు.

సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్‌ ట్రేడ్‌ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాబ్‌ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా సింగపూర్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చొరవ చూపాలని కోరారు.

Future City Investments | ఇన్వెస్ట్​మెంట్ హబ్​గా..

తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హబ్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వేగంగా అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’లో సింగపూర్‌ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Heavy Rains | రేపటి నుంచి భారీ వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *