Heavy Rains | రేపటి నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు దక్షిణ, తూర్పు ప్రాంతాలలో తీవ్రమైన వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు 37-39°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ (Telangana)లో బుధవారం అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కురుస్తాయి. ఉదయం నుంచే ఉక్కపోత ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. గురువారం రాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయి.

Heavy Rains | లోటు వర్షపాతం

ఈ వానాకాలం సీజన్​ ప్రారంభం అయిన నాటి నుంచి తెలంగాణలో లోటు వర్షపాతం నమోదు అయింది. ఎల్​ నినో ప్రభావంతో వర్షాలు ఎక్కువగా పడటం లేదు. జూన్​ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం – 664.5 మి.మీ కాగా.. 536.5 మి.మీ వర్షపాతం నమోదు అయింది. 19 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. సెప్టెంబర్ 12-14 మధ్య కురిసిన వర్షాలతో తెలంగాణలో వర్షపాత లోటు 25 శాతం నుంచి 19 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ 17-25 మధ్య రాబోయే బలమైన ఉరుములతో కూడిన వర్షాల కారణంగా, ఈ లోటు మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Telangana AICC In Charge | కాంగ్రెస్ నయా వ్యూహం..తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి మార్పునకు ముమ్మర కసరత్తు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *