MLA Rakesh Reddy | రాజీనామా చేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్మూర్​ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Rakesh Reddy | ఆర్మూర్​ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో ప్రకటించారు.

ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి బుధవారం శాసనసభలో మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఆర్మూర్‌లోని శతాబ్దం నాటి పాత తహశీల్దార్​ కార్యాలయ భవనానికి బదులుగా కొత్త భవనాన్ని నిర్మించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసిన రాకేష్ రెడ్డి, అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అసెంబ్లీలో ప్రకటించారు.

MLA Rakesh Reddy | రెండేళ్లుగా అడుగుతున్నా..

ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​ ఆఫీస్​ కూడా క్లర్క్​ స్థాయి అధికారి కూర్చేనే కార్యాలయంలా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కొత్త భవనాల కోసం రెండేళ్ల నుంచి తాను తిరుగుతున్నట్లు చెప్పారు. సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలిపోయే దశలో ఉన్న తహశీల్దార్​ కార్యాలయాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్​ చేశారు. సభ ముగిసే సమయంలో తనకు మాట్లాడటానికి పది నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు. ఈ రోజు రాజీనామా చేయాలి అనుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి..: Bullet Bike Seized | పబ్లిక్​ న్యూసెన్స్​ చేస్తున్న బుల్లెట్​ బైక్​ సీజ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *