అక్షటుడే, బాల్కొండ : Bullet Bike Seized | బైక్‌కు ఎక్స్ట్రా సైలెన్సర్ బిగించుకుని భారీ శబ్దంతో న్యూసెన్స్ చేస్తున్న బుల్లెట్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన బాల్కొండ మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
Bullet Bike Seized | బాల్కొండ మండలంలో..
బాల్కొండ (Balkonda) పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ బుల్లెట్ ద్విచక్ర వాహనానికి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ బైక్‌ను పోలీసులు గుర్తించారు. అనంతరం బైక్‌ను స్వాధనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. వాహనాలకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు బిగించుకోవడం చట్టప్రకారం నేరమన్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేసే వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Gandhari AO Rajalingam FIR | రైతును బూతులు తిట్టిన గాంధారి ఏవో రాజలింగంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్