Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు. నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలంలోని పల్లికొండ గ్రామంలోని ఓ ఇంట్లో చొరబడిన దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.

Pallikonda Theft Case | బంగ్లాపై నిద్రిస్తుండగా..

భీమ్​గల్(Bheemgal) ఎస్సై తిరుపతి (Bheemgal Police) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెడ్డుబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి మేడపై నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో కిందికి వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు.

లోపలికి వెళ్లి చూడగా సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. బెడ్‌రూమ్‌లోని బీరువాను పగులగొట్టిన దుండగులు, అందులోని 5 తులాల బంగారు ఉంగరాలు, గొలుసులు, చెవి కమ్మలు, మాటీలు, వెండి పాద సరాలతో పాటు ఇతర ఆభరణాలను దొంగిలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్​టీం (Clues Team) వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *