Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

Naresh Chandan
Modi UAE Visit

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల (మే)లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో నాలుగు యూరప్ దేశాలకు వెళ్లనున్నారు.

కాగా, మార్గమధ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో మోడీ ఆగనున్నట్లు సమాచారం. యూఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Modi UAE Visit | యూఏఈ పర్యటనపై ఆసక్తి

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విదేశీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా యూఏఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

రెండు దేశాల మధ్య ఇంధన భద్రతతో పాటు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), పెట్టుబడుల పెంపుపై చర్చించనున్నట్లు సమాచారం.

దీనికితోడు ఆహార ఉత్పత్తుల రవాణా కారిడార్లు, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సహకారం, పశ్చిమాసియాలో శాంతి భద్రతలు, రక్షణ రంగంలో భాగస్వామ్యంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Modi UAE Visit | ఇరు దేశాల మధ్య సంబంధాలు:

కొద్ది కాలం క్రితమే భారత్‌ను యూఏఈ అధ్యక్షుడు సందర్శించారు. తాజాగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలు ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.

చమురు సరఫరాపై ఆందోళనల క్రమంలో ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ యూఏఈలో పర్యటించారు.

‘ఒపెక్‌’ నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా యూఏఈ ప్రకటించిన తరుణంలో ప్రధాని మోడీ చేపట్టే చర్చలు చమురు దిగుమతుల్లో ఎంతో కీలకం కానున్నాయంటున్నారు.

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *