అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Bribery Case | దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతోంది. గ్రామీణ స్థాయి ఉద్యోగి నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారుల వరకు లంచాల పేరుతో ప్రజలను వేధిస్తునే ఉన్నారు. అందిన కాడికి దండుకొని అక్రమాస్తులు కూడబెడుతున్నారు. తాజాగా హర్యానా (Haryana)లో అసిస్టెంట్ డీజీఎఫ్ను సీబీఐ అరెస్టు చేసింది.
హర్యానాలోని పానిపట్‌లో ఉన్న జాయింట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కార్యాలయంలోని అసిస్టెంట్ DGFTని లంచం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. నిందితుడిపై సీబీఐ (CBI) బుధవారం కేసును నమోదు చేసింది. ఫిర్యాదుదారుడి క్లయింట్‌కు సంబంధించి లోపాన్ని సరిచేసి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (EPCG) ఆథరైజేషన్ ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి అసిస్టెంట్ డీజీఎఫ్ రూ.30,000 లంచం డిమాండ్ చేశారు. బుధవారం బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నివాసం, కార్యాలయ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు.
CBI Bribery Case | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ..
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో IFAగా పనిచేస్తున్న డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఓ ఫైల్‌ను వేగంగా ప్రాసెస్ చేయడానికి రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు తగ్గించాఉడ. తన వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ పునరుద్ధరణ ఫైల్‌ను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ డబ్బు అడిగాడు. నిందితుడు తన భార్య ద్వారా రూ. 10 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.
దీనిని కూడా చదవండి : Nizamabad Crime Records | సీపీ కార్యాలయంలో రికార్డులను పక్కాగా రూపొందించాలి