అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Police | తెలంగాణ పోలీస్‌శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు డీజీపీ సీవీ (DGP CV Anand) ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు.
మారుతున్న నేరాలు, ప్రజా భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసులు తమ సిబ్బందిని హేతుబద్ధీకరిస్తున్నారని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రహదారి భద్రత (Road Safety), ట్రాఫిక్ నిర్వహణ, ఇతర కొత్త ముప్పులపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉన్న రోజులతో పోలిస్తే పోలీసింగ్ గణనీయంగా మారిందన్నారు.
Telangana Police | 513 మందికి కొత్త బాధ్యతలు
గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ (SIB) వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన 513 మంది పోలీసులకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు, బదిలీలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ట్రాఫిక్, రోడ్డు భద్రతకు 224 మందిని కేటాయించాన్నారు. 11 రోజుల శిక్షణ తర్వాత సిబ్బంది బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్‌కు 80 మంది సిబ్బందిని పంపించామన్నారు.
దీనిని కూడా చదవండి : Movie Ticket Prices | సినిమా టికెట్లకు కొత్త ధరలు.. చిన్న సినిమాలకు ప్రోత్సాహం