అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mandal Prajavani | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి, సంస్థాగతం చేసి, వికేంద్రీకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం, పారదర్శకంగా, జవాబుదారీగా మరియు పౌరకేంద్రీకృతంగా మార్చింది. గతంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించేవారు. అనంతరం ఆర్డీవో (RDO) కార్యాలయాలకు విస్తరించారు. తాజాగా మండల కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Mandal Prajavani | నోడల్ అధికారిగా ఎంపీడీవో
ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మండల పరిషత్ (MPDO) కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహిస్తారు. దీనికి ఎంపీడీవో నోడల్ అధికారిగా ఉంటారు. సంబంధిత శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు అందరు ఖచ్చితంగా హాజరు కావాలి. గతంలో కూడా మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించేవారు. అయితే అధికారులు మొక్కుబడిగా హాజరు అయ్యేవారు. మరి ఇప్పుడు పక్కాగా వస్తారా.. నామమాత్రంగా నిర్వహిస్తారా అనేది చూడాలి.
Mandal Prajavani | పోర్టల్‌లో నమోదు చేయాలి
మండల స్థాయి ప్రజావాణి సమయంలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలి. నియమించబడిన రిజిస్ట్రేషన్ కౌంటర్, పిటిషనర్ ఫిర్యాదును పోర్టల్‌లో నమోదు చేసి, పిటిషనర్ సమర్పించిన అన్ని సహాయక పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫిర్యాదు ఐడీ, ఫిర్యాదుకు సంబంధించిన ఇతర వివరాలతో కూడిన రసీదును అందించాలి.
Mandal Prajavani | సమస్యలు పరిష్కారం అయ్యేనా..
ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా, ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వందలాది మంది వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. అయితే అందులో చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కొత్తగా మండలాల వారీగా నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు పరిష్కరిస్తారా.. మొక్కుబడిగా నిర్వహిస్తారా చూడాలి.
The Government of Telangana has issued orders to institutionalize and decentralize the Prajavani Programme by extending it to the Mandal level, making public grievance redressal more accessible, transparent, accountable and citizen-centric. pic.twitter.com/FFDhPjc2GY
— Jacob Ross (@JacobBhoompag) August 4, 2026
దీనిని కూడా చదవండి : RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్ : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్