Lingampet Ayyappa Temple | నేడు తెరుచుకోనున్న లింగంపేట అయ్యప్ప ఆలయం

లింగంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తెరుచుకోనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, ఎల్లారెడ్డి; Lingampet Ayyappa Temple | లింగంపేట మండల (Lingampet Mandal) కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తెరుచుకోనుంది. గురువారం ఉదయం 5:30 గంటల నుండి 5 రోజుల పాటు స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

Lingampet Ayyappa Temple | పూజా కార్యక్రమాల వివరాలు:

ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. శనివారం కుంకుమార్చన, ఆదివారంశ్రీ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, సోమవారం సాయంత్రం 7 గంటలకు పడి పూజా మహోత్సవం నిర్వహిస్తారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు నిత్యం ఉదయం 7 గం.లకు గణపతి హోమం, 7–11 గంటల వరకు నెయ్యి అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన నిర్వహిస్తారు.

అనంతరం 12:30 గంటలకు ఆలయం మూసివేసి, సాయంత్రం 5:30 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 6:30 గంటలకు హారతి, 7:30 గం.లకు – పుష్పాభిషేకం, 8 గంటలకు మహా నివేదన చేపడుతారు.ఈ మాస పూజల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: MLA Rakesh Reddy | రాజీనామా చేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *