అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shabad Murders Case | రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు (POCSO Case) నిందితుడు ఆరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు.
నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టిస్తే రూ.2లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు. ఆరుగురిని హత్య చేసి రాజ్‌కుమార్ పారిపోయాడు. ఇప్పటికే పోలీసులు నిందితుడి కోసం 10 బృందాలతో గాలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఆచూకీ లభించకపోవడంతో తాజాగా రివార్డు ఇస్తామని ప్రకటించారు.
Shabad Murders Case | నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో..
రాజ్‌కుమార్ తనపై పోక్సో పెట్టిన బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను హత్య చేశాడు. అంతేగాకుండా తన భార్య, పిల్లలను సైతం మర్డర్ చేశాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఆరు హత్యలు జరిగాయని స్థానికులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉదయం ప్రకటించారు. సీఐ క్రాంతిరెడ్డిని సైతం సస్పెండ్ చేస్తూ తాజాగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌కు పోలీసులు సహకరించడంతోనే ఈ హత్యలు జరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు.
దీనిని కూడా చదవండి : Rainwater Harvesting | ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి