Renjal Model School | రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ

రెంజల్ మోడల్ స్కూల్‌లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Renjal Model School | రెంజల్ మోడల్ స్కూల్‌లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Renjal Model School | పాఠశాలలో తీవ్రమైన అవినీతి..

ఏబీవీపీ (ABVP) ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశింధర్ మాట్లాడుతూ.. రెంజల్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ చేసిన అక్రమాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయన్నారు. ముఖ్యంగా స్కూల్‌లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారితో ప్రిన్సిపాల్ కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. విద్యార్థుల అటెండెన్స్‌ను ఉదయాన్నే మార్పులు చేస్తూ రెండు వేర్వేరు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సంతకాలను సైతం ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకేషనల్ కోర్సుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లించి, వేరే ఒక వ్యక్తి అకౌంట్ ద్వారా ఆ డబ్బులను డ్రా చేసుకున్నారన్నారు.

Renjal Model School | పాఠశాల ప్రాంగణంలో పర్యావరణానికి విఘాతం

Renjal Model School

పాఠశాల ప్రాంగణంలో పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేతకు పాల్పడ్డారని శశింధర్​ అన్నారు. ఈ దారుణమైన అక్రమాలకు సంబంధించి, ఉపాధ్యాయుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు స్వయంగా ప్రిన్సిపాల్ ఒప్పుకున్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.  ప్రిన్సిపాల్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించినట్లు తెలుస్తోందన్నారు. విచారణ అధికారుల ముందు తమకు అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వాలని ప్రిన్సిపాల్ అక్కడి ఉపాధ్యాయులను, సిబ్బందిని బెదిరించడం, ఒత్తిడి తీసుకురావడం ఆయన తప్పులను స్పష్టం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రక్షిత్, చెర్రీ దీపాన్, సాయి, క్షేహిత్, శ్రీసాయి, శివ, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bheemgal Oora Panduga | భీమ్‌గల్‌లో ఊర పండుగకు వేళాయె.. రెండు రోజుల పాటు వేడుకలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *