NDA New MPs Meeting | ఎన్డీఏలో కొత్తగా చేరిన ఎంపీలతో రేపు ప్రధాని భేటీ

ఎన్డీఏలో కొత్తగా చేరిన 26 మంది ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ కానున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NDA New MPs Meeting | ఎన్డీఏలో కొత్తగా చేరిన 26 మంది ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం భేటీ కానున్నారు. రేపు ఉదయం అల్పాహార విందు సమావేశానికి ఎంపీలకు ప్రధాని ఆహ్వానం పంపారు.

శివసేన (Shivsena) ఉద్దవ్​ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఇటీవల ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్​లో మమతా బెనర్జీ అధికారం కోల్పోగానే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. పార్టీని చీల్చి రెండుగా విడిపోయారు. ఈ క్రమంలో బెంగాల్‌కు చెందిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలు మమతా బెనర్జీ పార్టీని వీడి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) పార్టీలో చేరారు. అంతేకాకుండా వీరు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్డీఏలో చేరిన ఈ 26 మందితో ప్రధాని రేపు భేటీ (NDA New MPs Meeting) కానున్నారు.

NDA New MPs Meeting | కీలక బిల్లుల వేళ..

కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను పార్లమెంట్​లో ప్రవేశ పెట్టాలని చూస్తోంది. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్నాయి. అనంతరం ప్రత్యేక సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ (Delimitation)​ బిల్లు, మహిళా రిజర్వేషన్​ బిల్లులను ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. ఇవి రాజ్యాంగ సవరణ బిల్లులు కావడంతో మూడింట రెండోంతుల మెజారిటీ అవసరం. గతంలో ఈ బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టగా.. 54 ఓట్ల తేడాతో వీగిపోయింది. మొత్తం 528 ఓట్లు పోల్​ కాగా.. 2/3 వంతుల మెజారిటీ కోసం 352 ఓట్లు అవసరం. అయితే బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజాగా 26 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో ఇంకా కొంత మంది ఎంపీల బలం కూడగడితే బిల్లులు ఆమోదించుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది.

దీనిని కూడా చదవండి : GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *