అక్షరటుడే, వెబ్‌డెస్క్: GPO ACB Trap | జగిత్యాల జిల్లా (Jagtial District) మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామపాలన అధికారి (GPO) మాతే రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడిని అధికారులు అరెస్ట్ చేశారు.
కథలాపూర్ మండలం దంపేట గ్రామానికి చెందిన రాజేశ్ ఆత్మకూర్ గ్రామంలో జీపీవోగా పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణ కోసం ఆయన వద్ద దరఖాస్తు చేసుకున్నారు. జీపీవో తయారుచేసిన విచారణ నివేదికను రెవెన్యూ అధికారికి సమర్పించడం కోసం అతను రూ.5,000/- లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. కరీంనగర్ యూనిట్ అధికారులు జీపీవో రాజేశ్‌ను వల పన్ని పట్టుకున్నారు.
GPO ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ (ACB Website) ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి..: Siddapur Reservoir | సిద్దాపూర్ రిజర్వాయర్‌తో సాగునీటి కష్టాలు దూరం: ఎమ్మెల్యే పోచారం