అక్షరటుడే, వెబ్‌డెస్క్: DIET Deputation | తెలంగాణ (Telangana) డైట్ లెక్చరర్ల డిప్టేషన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్టులు, 8 మంది ఇతరులు మార్కులు కేటాయించే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో అసలైన అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
డైట్ కాలేజీల్లో డిప్యూటేషన్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వూ చేసే కమిటీలో కలెక్టర్ నామినేటెడ్ సభ్యుడు, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్, మరో ఇద్దరు సబ్జెక్ట్ expert, ఉమ్మడి జిల్లాలోని డీఈవోలు సభ్యులుగా ఉంటారు. 20 మార్కులకు అందరు అధికారులు మార్కులు వేయాలని, యావరేజ్ తీసి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఎస్సీఈఆర్టీ ఆదేశాలు ఇచ్చింది. ఆ కమిటీలో సబ్జెక్ట్ నిపుణులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగతా వారికి సబ్జెక్టుతో సంబంధం లేదుజ కానీ మార్కులలో క్రియాశీలకంగా వేసి వచ్చేవారికి రాకుండా రాని వారికి వచ్చే విధంగా చేసే అవకాశం ఉంది. ఇందులో రోస్టర్ విధానం సైతం పాటించడం లేదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరిగే ఈ విధానాన్ని వెంటనే ఆపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
DIET Deputation | సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
సీనియర్ ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా డిప్యుటేనషన్లలో అన్యాయం చేయడం తగదు. నిజామాబాద్ డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఒక అభ్యర్థిని ఎస్సీఆర్టీ వద్దకు ప్రత్యక్షంగా తీసుకువెళ్లి మార్కులు ట్యాంపరింగ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మొత్తం ప్రక్రియను రద్దుచేసి నిబంధనల ప్రకారం పెట్టాలనిఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది.
DIET Deputation | ఇన్‌సర్వీస్ టీచర్లకు..
ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్ నియామకాలలో ఇన్ సర్వీస్ టీచర్లకు పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, వంటి రోస్టర్ రిజర్వేషన్లకు అవకాశం లేదు. సీనియర్ ఉపాధ్యాయులకు సీనియార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి పాయింట్లు కేటాయించకుండా నియామకాలు జరుగుతున్నాయి. నియామక కమిటీలు, సబ్జెక్ట్ నిపుణులతో పాటు ఇతర సభ్యులకు మార్కులు కేటాయించే బాధ్యతను అప్పగించాయి. ఈ ఇతరులు పాత డైట్ పరిధికి వచ్చినటువంటి అన్ని జిల్లాల డీఈవోలు ఉన్నారు. సబ్జెక్టు సంబంధించిన మార్కులు వీళ్లు ఎలా వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో డిప్యుటేషన్‌పై పనిచేసిన ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రాధాన్యత లేదు.
ఇది కూడా చదవండి..: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్