అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సామంత రాజులా ఢిల్లీకి తిరుగుతున్నారని, లోక్సభలో బీజేపీ ఎంపీ తెలంగాణను అవమానించినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరుమెదపలేదని విమర్శించారు. మనకేమో జయశంకర్ సార్ గురువు అని.. రేవంత్ రెడ్డికేమో చంద్రబాబు నాయుడు గురువు అన్నారు. అందుకే పుష్కలంగా నీళ్లున్న మోటార్లు ఆన్ చేస్తలేరని విమర్శించారు.
KTR | 75 సార్లు ఢిల్లీకి వెళ్లారు
జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పని ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు ఉండటం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జయశంకర్ సార్ అన్నారని గుర్తు చేశారు. సామంత రాజు లాగా రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి పోయారని ఎద్దేవా చేశారు. జయశంకర్ సార్ మనల్ని ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలని కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Defamation Case | క్షుద్రపూజల ఆరోపణలు.. కాంగ్రెస్కు హరీశ్ రావు వార్నింగ్