Dundigal POCSO Case | బాలికపై యువకుల లైంగిక దాడి.. నిందితులపై పొక్సో కేసు నమోదు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dundigal POCSO Case | బాలికపై ఇద్దరు యువకులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గ్రేటర్​ హైదరాబాద్​ పరిధి దుండిగల్​ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఓ యువకుడు బాలికను రేప్​ చేయడమే కాకుండా.. తన స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడి, ఆ పాశవిక చర్యను వీడియో తీసి పలుమార్లు బాలికను బ్లాక్మెయిల్ చేశాడు.

బెదిరిపోయిన బాలిక తనపై జరిగిన దారుణ ఉదంతాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో , వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.

Dundigal POCSO Case | డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో..

హైదరాబాద్ – దుండిగల్ ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలోని ఓ షామియానా దుకాణంలో శివకుమార్ అలియాస్ మట్టు(20) అనే యువకుడు పని చేసేవాడు. కాగా, అటువైపు నుంచి రోజూ వెళ్లే బాలికపై కన్నేశాడు.

ఒకరోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసిన శివకుమార్.. ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.

Dundigal POCSO Case | మౌనంగా ఉండటాన్ని అదునుగా చేసుకుని

బాలిక మౌనంగా ఉండటాన్ని అదునుగా చేసుకుని తన స్నేహితుడు నిజాంపేట రాము(30)తో కలిసి బాలికపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఫొటోలు–వీడియోలు తీసి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించాడు.

నిందితుల వరుస వేదింపులు తాళలేక బాధిత బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన దుర్ఘటన గురించి వివరించింది.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దుండిగల్​ పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Telugu States Summer | పల్నాడులో 48.1 డిగ్రీలు.. బయ్యారంలో 46.20…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *