అక్షరటుడే వెబ్‌డెస్క్: ED Raids Telangana | తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి ఉరుములేపారు. రాష్ట్రంలోని ఇసుక, గ్రానైట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్‌లలోని పలు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతుండటంతో అటు వ్యాపార, ఇటు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ED Raids Telangana | కేంద్ర బలగాల బందోబస్తు మధ్య దాడులు..
ఈ తనిఖీల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ (CISF) గట్టి బందోబస్తు మధ్య ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక, గ్రానైట్ రంగానికి చెందిన దాదాపు నాలుగు ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలు, అలాగే వాటి అధినేతల నివాసాల్లో ఈడీ అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ED Raids Telangana | వందల కోట్ల మళ్లింపు ఆరోపణలు..
సదరు కంపెనీలు భారీగా జీఎస్టీ (GST) ఎగ్గొట్టినట్లు ప్రాథమిక సమాచారం. అంతేకాకుండా, పన్ను ఎగవేత ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల అక్రమ సొమ్మును మనీలాండరింగ్ (Money Laundering) ద్వారా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు వచ్చిన బలమైన ఆరోపణల ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఈ సోదాల్లో భాగంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ ఆధారాలు , కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Heatwave Alert | దేశంలో భగభగమంటున్న ఎండలు.. ప్రజలకు మోదీ కీలక సూచనలు


