Harish Rao Defamation Case | క్షుద్రపూజల ఆరోపణలు..  కాంగ్రెస్‌‌కు హరీశ్ రావు వార్నింగ్

తాను క్షుద్రపూజలు చేశానంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Defamation Case | తాను క్షుద్రపూజలు చేశానంటూ కాంగ్రెస్ ( నేతలు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆధునిక యుగంలో ఇలాంటి నిందలు వేయడం సిగ్గుచేటని, రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, స్కాములను ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

Harish Rao Defamation Case | పరువు నష్టం కేసు వేస్తా..

క్షుద్రపూజల అంశంపై ఇష్టానుసారంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ సూట్ , పరువు నష్టం దావా వేయనున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే వారికి నోటీసులు పంపామని, లీగల్ యాక్షన్‌కు సంబంధించి ఇంకా 30 రోజుల సమయం ఉందని తెలిపారు. మంత్రి కొండా సురేఖ (Konda Surekha ) గతంలో చేసిన వ్యాఖ్యలకే ఇవాళ నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Harish Rao Defamation Case | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం..

రాష్ట్రంలో మైనింగ్ కుంభకోణం, నాదర్‌గుల్ భూముల వివాదం, గురుకుల టెండర్ల అవినీతిని బయటపెట్టామనే ఆక్రోశంతోనే తనపై బురదజల్లుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. దేవాదులలో 10 మోటార్లు ఉన్నప్పటికీ కేవలం 4 మాత్రమే నడుస్తున్నాయని, రైతులు నీళ్లు లేక అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతులు, విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని, ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Jharkhand Student Protest | జార్ఖండ్​లో విద్యార్థుల ఆందోళన.. పత్తా లేని కాంగ్రెస్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *