అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vijaya Lakshmi Hospital | నగరం (Nizamabad)లోని గణనాథుల మండపాల వద్ద పూజాకార్యక్రమాలు అన్నదానాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో గురువారం మహా అన్నదానం నిర్వహించారు.
Vijaya Lakshmi Hospital | ప్రతి ఏడాదిలాగే..

ఖలీల్వాడీలోఉన్న బండారి గ్రూప్స్ విజయలక్ష్మి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఆస్పత్రి వైద్యురాలు బండారి సుజాత, గాంధీ హాస్పిటల్ వైస్ ప్రిన్సిపాల్ నాగమోహన్ దంపతులు కలిసి వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా వినాయకుడికి పూజా కార్యక్రమం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వినాయకుడికి కృపతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బండారి భోజన్న, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Red Cross Society Elections | రెడ్‌క్రాస్ సంస్థ ఎన్నికలకు 29 నామినేషన్లు