Hospital Safety Standards | పిల్లల ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకదృష్టి

జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు భద్రతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Hospital Safety Standards | జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు భద్రతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకొని గురువారం ఆయన సీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Hospital Safety Standards | అగ్ని ప్రమాదాల నివారణకు..

ఆస్పత్రుల్లో చిన్నారుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో అగ్నిమాపక పరికరాల అందుబాటు, వాటి పనితీరు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అలారం వ్యవస్థ, విద్యుత్ భద్రత, సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో రోగులను సురక్షితంగా తరలించే విధానం తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, ఫైర్ సర్వీసెస్, వైద్య సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించే విధంగా అవసరమైన ఏర్పాట్లు, మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.

Hospital Safety Standards | సురక్షితమైన వాతావరణం

చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఆస్పత్రికి వచ్చే ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా.. ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ సర్వీసెస్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, డీఎంహెచ్​వో రాజశ్రీ , జిల్లా ఫైర్ అధికారి పరమేశ్వర్, ఎన్​ఎస్​సీ ప్రెసిడెంట్ కవితారెడ్డి, డీసీహెచ్ఎస్ శ్రీనివాస ప్రసాద్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ పీవీ రాజేశ్వర్ రావ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీసీఆర్​బీ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, గురు నాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Vijaya Lakshmi Hospital | బండారి విజయలక్ష్మి హాస్పిటల్​లో అన్నదానం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *