అక్షరటుడే, ఇందూరు: Mann Ki Baat 139th Episode | సామాన్యుల విజయగాథలకు జాతీయవేదికగా ‘మన్ కీ బాత్’ నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. ఆదివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్‌ను ఆయన వీక్షించారు.
Mann Ki Baat 139th Episode | దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ప్రజలకు కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం కార్యక్రమ ప్రత్యేకత అని తెలిపారు. 12ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మన్ కీ బాత్ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఒక ఆత్మీయ వారధిగా నిలిచిందన్నారు. ఈ ఎపిసోడ్లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని పేర్కొన్నారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: SBI సిబ్బంది నిర్లక్ష్యం తీరు..SMలో వీడియో వైరల్