అక్షరటుడే, పెద్దకొడప్గల్: Alumni Reunion | మండల కేంద్రంలోని (Pedda Kodapgal ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999–2000 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 26 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.
Alumni Reunion | పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణం..
జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న పాతస్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న రోజుల్లోని అనుభవాలు, ఆటపాటలు, ఉపాధ్యాయులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేస్తూ అప్పటి స్నేహబంధాలను మరోసారి పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పదో తరగతి అనంతరం వివిధ మార్గాల్లో ముందుకు సాగిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సమ్మేళనం పాత స్నేహాలను పునరుద్ధరించడంతో పాటు పరస్పర అనుబంధాలను మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను పదిల పర్చుకుంటూ పూర్వవిద్యార్థులు ఉత్సాహంగా సమయం గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అనంతరం ఆత్మీయ భోజనాలు చేశారు.
ఇది కూడా చదవండి : స్క్రాప్ షాపులో భారీ పేలుడు..