అక్షరటుడే, వెబ్డెస్క్ : TG SAFE Inspections | టీజీ సేఫ్ అధికారులు రాష్ట్రంలోని పలు స్వీట్ షాపులు, బేకరీల్లో తనిఖీలు చేశారు. శుక్రవారం దాడులు చేపట్టి, పలు ఉల్లంఘనలను గుర్తించారు. ఈ మేరకు తాజాగా వివరాలు వెల్లడించారు.
పలు దుకాణాల్లో తనిఖీ చేసిన అధికారులు కల్తీ జరిగిందనే అనుమానంతో 38 ఆహార నమూనాలను సేకరించారు. తనిఖీ సమయంలో పారిశుధ్యం, మురికి నేలలు, ఆహార వ్యర్థాలను గుర్తించారు. కొన్ని సంస్థలలో దెబ్బతిన్న నేలలు, ఆవరణలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఆహార వ్యర్థాలు, అపరిశుభ్రమైన వాషింగ్ ప్రాంతాలు, ఆహార వ్యర్థాలతో మూసుకుపోయిన మురుగు కాలువలను కనుగొన్నారు.
TG SAFE Inspections | 20 దుకాణాలకు నోటీసులు
తయారీ కేంద్రాల్లో కార్మికులు హెయిర్‌నెట్‌లు, గ్లౌజులు లేకుండా పనిచేస్తున్నారు. అంతేగాకుండా స్వీట్లు, బేకరీ ఉత్పత్తులను నేరుగా నేలపై పెట్టినట్లు అధికారులు గమనించారు. తనిఖీల సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని కోరుతూ, 20 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, నారాయణపేట, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోదాలు చేపట్టారు.
దీనిని కూడా చదవండి : RTC Weekly Pass | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్.. రూ.600లకే వారం పాస్