తెలంగాణliquor price hike | మద్యంప్రియులకు షాకింగ్​ న్యూస్​.. త్వరలో పెరగనున్న ధరలు

liquor price hike | మద్యంప్రియులకు షాకింగ్​ న్యూస్​.. త్వరలో పెరగనున్న ధరలు

రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెలలో రేట్ల పెంపు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : liquor price hike | రాష్ట్రంలో మందుబాబులకు షాక్ తగలనుంది. మద్యం రేట్లను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100 పెంచనున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై ఈ నెలలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేట్లు పెంచాలని మద్యం కంపెనీలు చాలా రోజులుగా కోరుతున్నాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ డిస్టలరీల నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను పరిశీలిస్తోంది. పరిశీలన అనంతరం లిక్కర్ ధరలు పెంచనున్నట్లు తెలిసింది.

liquor price hike | రెండేళ్లకు ఓ సారి

రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి మద్యం ధరలు పెంచుతారు. గతంలో బీఆర్​ఎస్​ (BRS) హయాంలో 2023 మేలో రేట్లు పెంచారు. లెక్క ప్రకారం 2025 మే నెలలో రేట్లు పెంచాలి. అయితే అప్పుడు ప్రభుత్వం ధరలు పెంచలేదు. నాటి నుంచి లిక్కర్ రేట్లను సవరించాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే తాజాగా పశ్చిమాసియా (Western Asia)లో యుద్ధంతో మద్యం బాటిల్స్ తయారీ‌పై ప్రభావం పడింది. బాటిల్స్ తయారీ కోసం ఉపయోగించే గ్యాస్ ధరలు, మద్యం ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రేట్లు పెంచాలని మరోసారి కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి.

liquor price hike | వచ్చే వారం సమావేశం

మద్యం ధరల కోసం ప్రభుత్వం గతంలో ముగ్గురు సభ్యుల కమిటీని వేసింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సాధారణ బ్రాండ్స్‌కు చెందిన పుల్ బాటిల్‌పై రూ.60 వరకు, ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. రేట్లు పెరిగితే ప్రతినెలా రూ.250 కోట్లు, ఏడాదికి సుమారు రూ.3 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.

దీనిని కూడా చదవండి : TG Organics App | ప్రభుత్వం గుడ్​న్యూస్.. యాప్​లో సేంద్రియ ఉత్పత్తులు కొనొచ్చు

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Defamation Case MLA | ఎమ్మెల్యేపై పరువునష్టం దావా కేసు..

అక్షరటుడే, కామారెడ్డి: Defamation Case MLA | కామారెడ్డి రాజకీయాలు మరోసారి...

Paddy Procurement Protest | రోడ్డెక్కిన అన్నదాతలు.. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

అక్షరటుడే, కామారెడ్డి/ఆర్మూర్​: Paddy Procurement Protest | ధాన్యం కొనుగోలు కేంద్రాలు...

Hit and run case | మాజీ ఎమ్మెల్యే కుమారుడికి షాక్​ ఇచ్చిన పోలీసులు..

అక్షరటుడే, నెట్​వర్క్​: Hit and run case | కోర్టు అనుమతి...

TMC Setback | మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TMC Setback | సుప్రీంకోర్టు (Supreme Court)లో...