అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Heavy Rains | గతంలో సెప్టెంబరు 13-16 మధ్య కురుస్తాయని అంచనా వేసిన వర్షాలు ముందుగానే రానున్నాయి. 12 – 13 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా తీరం వెంబడి అల్పపీడనం (LPA) ఏర్పడింది. ఇది గతంలో అంచనా వేసిన మార్గంలో కాకుండా తాజాగా ఉత్తర దిశగా కదులుతోంది.
Telangana Heavy Rains | విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతం
ఇది బలహీనపడి విదర్భ ప్రాంతంలో అల్పపీడనంగా కేంద్రీకృతం కానుంది. దీనివల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 50-70 మి.మీ వరకు వర్షపాతం నమోదు కావచ్చు.
హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.