TG Organics App | ప్రభుత్వం గుడ్​న్యూస్.. యాప్​లో సేంద్రియ ఉత్పత్తులు కొనొచ్చు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG Organics App | ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో సాగైన పంటలకు అధిక డిమాండ్​ ఉంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడిన పంటలతో ఆరోగ్యానికి హాని కలుగుతోందని పలువురు సేంద్రియ ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.

రాష్ట్రంలో పలువురు రైతులు సేంద్రియ సాగు (Organic Farming) వైపు మళ్లుతున్నారు. అయితే ఈ విధానంలో దిగుబడి తక్కువగా ఉంటుంది. బయట మార్కెట్​ రేటుతో అమ్మితే రైతులు నష్టపోతారు. సేంద్రియ పంటలను ఆసక్తి ఉన్న వారు కొనుగోలు చేస్తున్నారు. అయితే సేంద్రియ రైతులు, కొనుగోలుదారులను కలిపేందుకు ప్రభుత్వం యాప్​ రూపొందించింది. రాష్ట్రంలో ఇక రైతుల నుంచి నేరుగా సేంద్రియ ఉత్పత్తులను యాప్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు

TG Organics App | మే 4న ప్రారంభం

ప్రభుత్వం మే 4న “టీజీ ఆర్గానిక్స్” యాప్‌ను ప్రారంభించనుంది. రైతులు, కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం, నకిలీ సేంద్రియ ఉత్పత్తులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. తాండూరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఈ యాప్​ను ప్రారంభిస్తారు. కొనుగోలుదారులు ధృవీకరించబడిన సేంద్రియ రైతులతో నేరుగా కనెక్ట్ అవ్వవచ్చు. యాప్‌లో ఇప్పటికే 500కుపైగా మంది రైతులు నమోదు చేసుకున్నారు. 100కు పైగా పంట ఉత్పత్తులు ఉన్నాయి.

TG Organics App | ధ్రువీకరణ ఉంటేనే..

సేంద్రియ సాగుకు డిమాండ్​ ఉండటంతో కొందరు ఇతర పద్ధతిలో పండించిన పంటలను సైతం ఆర్గానిక్​ ప్రోడక్ట్స్​ అంటూ విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వ ధృవీకరణ పొందిన రైతుల పేర్లు మాత్రమే యాప్​లో ఉంటాయి. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల వివరాలు మనకు యాప్​లో కనిపిస్తాయి. వారి నుంచి మనకు కావాల్సిన పదార్థాలు కొనుగోలు చేయొచ్చు. తెలంగాణలో 10,000 మందికిపైగా మంది సేంద్రియ రైతులు, సుమారు 50,000 ఎకరాల భూమి ధృవీకరణ పరిధిలో ఉంది. ఈ యాప్​తో అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరగనుంది.

దీనిని కూడా చదవండి : conductor attacks officer | లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *