అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nanded Tiruchanur Train | వేసవి సెలవుల నేపథ్యంలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు రద్దీ కొనసాగుతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పెద్దపల్లి జంక్షన్ (Peddapalli Junction) మీదుగా నడుస్తున్న నాందేడ్ నుండి తిరుచానూరు (Tirupati) వీక్లీ స్పెషల్ ట్రైన్ సర్వీస్‌ను తాజాగా క్రమబద్దీకరించింది.
వీక్లీ ఎక్స్‌ప్రెస్ నంబర్ గతంలో 07015/16 ఉండగా.. క్రమబద్ధీకరణ తర్వాత ఈ రైలు సంఖ్య 17633/34 గా మారింది. ఈ రైలు మే 9 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 9న నాందేడ్ (Nanded Railway Station) నుంచి తిరుపతి వెళ్తుంది. 10న తిరుపతి నుంచి తిరుగు పయనం అవుతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Nanded Tiruchanur Train | 16 బోగీలు
నాందేడ్– తిరుచానూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో ఏసీ టైర్–1 ఒకటి, టైర్–2 ఒకటి, ఏసీ టైర్–3 బోగీలు 4 ఉటాయి. స్లీపర్ 6, జనరల్ బోగీలు 4 ఉంటాయి. ఈ రైలు బాసర, నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
ఇది కూడా చదవండి : Mumbai Cocaine Seizure | ముంబైలో ఎన్సీబీ సంచలనం.. రూ.1,745 కోట్ల కొకైన్ సీజ్!

