TMC Setback | మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TMC Setback | సుప్రీంకోర్టు (Supreme Court)లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను మాత్రమే నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీఎంసీ కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్​ను న్యాయస్థానం తిరస్కరించింది.

పశ్చిమ బెంగాల్​లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరిగింది. మే 4న కౌంటింగ్​ నిర్వహించనున్నారు. అయితే కౌంటింగ్​ సూపర్​వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల సంఘం నియమించింది. దీనిపై టీఎంసీ హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. అక్కడ ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది.

TMC Setback | ఏజెంట్లు ఉంటారు కదా!

కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. “వీరందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు. కానీ ఇప్పుడు వారు ఈసీఐ పరిధిలో ఉన్నారు, మీకెందుకు అనుమానాలు? మీ కౌంటింగ్ ఏజెంట్ కూడా అక్కడ ఉంటారు. కేవలం మీ పార్టీ ఏజెంట్ మాత్రమే కాదు, అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరే రకమైన తెలివితేటలు ఉంటాయనే మీ అభిప్రాయం ఎందుకు?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి..: Rs 2000 Notes | పూర్తిగా వెనక్కి రాని రూ. 2 వేల నోటు.. ఇంకా జనం వద్దే రూ. 5,451 కోట్ల నోట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *