Rs 2000 Notes | పూర్తిగా వెనక్కి రాని రూ. 2 వేల నోటు.. ఇంకా జనం వద్దే రూ. 5,451 కోట్ల నోట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rs 2000 Notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) దేశంలో చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ప్రకటించింది. కాగా కరెన్సీ ఉపసంహరణను ప్రకటించిన సమయంలో చలామణిలో ఉన్న రూ. 2వేల నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు.

జనం వద్దనన్న పెద్ద నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ ల బ్రాంచులలో డిపాజిట్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. ఈ అవకాశం 2023, అక్టోబర్ 7 వరకు కొనసాగింది. అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే వెసులుబాటు ఇచ్చింది. అక్కడ డిపాజిట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్లలోకి క్రెడిట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జనం తమ దగ్గర ఉన్నటువంటి రూ. 2 వేల విలువైన కరెన్సీ నోట్లను దేశంలోని ఎక్కడి పోస్టాఫీస్ నుంచి అయినా ఇండియా పోస్ట్ (India Post) ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపించే వెసులుబాటు తీసుకువచ్చింది.

Rs 2000 Notes | ఆర్ బీఐని చేరిన నోట్లు 98.47 శాతం..

చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో ఇప్పటివరకు 98.47 శాతం వాపస్ వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏప్రిల్ 30 నాటికి ఇంకా రూ. 5,451 కోట్ల విలువైన నోట్లు తమను చేరలేదని పేర్కొంది. కాగా 2025 డిసెంబర్ 31 నాటికి రూ. 5,669 కోట్ల నోట్లు చలామణిలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 5,501 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఇంకా రూ. 5,451 కోట్ల విలువైన నోట్లు కేంద్ర బ్యాంక్ ను చేరాల్సి ఉంది.

ప్రజలు దేశంలోని పోస్ట్ ఆఫీస్‌ల నుంచి, ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవడం కోసం ఆర్బీఐ జారీ కార్యాలయాలకు పంపుతున్నారని తెలిపింది. రూ. 2,000 నోట్లు ఇంకా చట్టబద్ధమైన చలామణిలో కొనసాగుతాయని కేంద్ర బ్యాంకు స్పష్టత ఇచ్చింది. ఎవరి వద్దయినా రూ. 2 వేల నోట్లు ఉంటే మార్పిడి కోసం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపించవచ్చని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Auto Sales in India | ఆటో.. అదరహో.. రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *