అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CMR Rice Mill Cases | జిల్లాలో (Nizamabad) పలు రైస్‌మిల్లులపై (Rice Mills) విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో ఈ తనిఖీలు కలకలం సృష్టించాయి.
CMR Rice Mill Cases | సన్నిబియ్యానికి బదులు దొడ్డు బియ్యం..
జిల్లాలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం ఇచ్చిన ఆరుగురు రైస్మిల్లర్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన వారిపై ఫోకస్ పెట్టిన అధికారులు పూర్తి వివరాలు సేకరించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. త్వరలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లాలోని రైస్‌మిల్లుల యజమానుల్లో ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి : జనసేనకు సపోర్ట్ చేయొద్దు..మంత్రి నారాయణ ఆడియో వైరల్